పోప్‌కు క్షమాపణ చెప్పను: ట్రంప్
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:04 AM
పోప్ 14వ లియోతో వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. పోప్‌కు క్షమాపణ చెప్పేది లేదని ట్రంప్ తెగేసి చెప్పారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 14: పోప్ 14వ లియోతో వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. పోప్‌కు క్షమాపణ చెప్పేది లేదని ట్రంప్ తెగేసి చెప్పారు. తన ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను పోప్ లియో తరచూ విమర్శిస్తున్నారని సోమవారం ఆయన మండిపడ్డారు. పోప్‌కు క్షమాపణ చెప్పాలన్న బిషప్ రాబర్ట్ బారన్ డిమాండ్‌ను ట్రంప్ తిరస్కరించారు. తాను ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్నానని చెప్పారు. ట్రంప్ తీరుపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోప్‌పై ట్రంప్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మంగళవారం స్పష్టంచేశారు. పోప్ క్యాథలిక్ చర్చి అధిపతి అని, ప్రపంచంలో హింస ఏ రూపంలో ఉన్నా ఖండించే హక్కు పోప్‌కు ఉందని అన్నారు. మరోవైపు పోప్ లియో ప్రకటనను ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బిఘర్ ఘాలిబఫ్ స్వాగతించారు. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధాన్ని పోప్ ధైర్యంగా వ్యతిరేకించారని కొనియాడారు.