Share News

గాల్లో మేడలు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్ మీడియా

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:32 AM

శుద్ధి చేసిన యూరేనియంను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తోసిపుచ్చింది. గాల్లో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేసింది.

గాల్లో మేడలు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్ మీడియా
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో త్వరలో డీల్ కుదురుతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఎద్దేవా చేసింది. ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని హేళన చేసింది. ట్రంప్ తొందరపాటుతో మాట్లాడారని అభిప్రాయపడింది.

కొన్ని వారాల పాటు దాడులు, హోర్ముజ్ దిగ్బంధనం ఫలితాన్ని ఇచ్చినట్టే ఉన్నాయని తాను భావిస్తున్నట్టు ట్రంప్ గురువారం పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. శుద్ధి చేసిన యూరేనియంను అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. డీల్ కుదరవచ్చని కూడా చెప్పారు. ఇస్లామాబాద్‌లో డీల్‌ కుదిరితే తాను పాక్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని అన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు అణు కార్యకలాపాలను కట్టిపెట్టాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించగా 5 ఏళ్ల కాలవ్యవధికే అంగీకరించిందన్న వార్తలూ వెలువడ్డాయి.


ఇక అమెరికా ప్రభుత్వ వర్గాల ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. అనేక అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని చెబుతోంది. ఇరు దేశాల మధ్య త్వరలో కాల్పుల విరమణ ముగియనుండటంతో ప్రస్తుత పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి:

అందుకు ఇరాన్ ఒప్పుకుంది.. త్వరలో మా మధ్య డీల్: ట్రంప్

భార్యను చంపిన యూఎస్ మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్.. ఆపై ఆత్మహత్య

Updated Date - Apr 17 , 2026 | 11:01 AM