Share News

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:41 AM

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల దౌత్య ప్రతినిధులు వాషింగ్టన్‌ డీసీలో...

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌ డీసీ, ఏప్రిల్‌ 16: ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల దౌత్య ప్రతినిధులు వాషింగ్టన్‌ డీసీలో చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్లతో తాను మాట్లాడానని, ఇద్దరు నేతలూ కాల్పుల విరమణకు అంగీకరించారని వెల్లడించారు. ఇద్దరు నేతలను తాను వైట్‌హౌ్‌సకు ఆహ్వానించానని తెలిపారు. 34 ఏళ్ల తర్వాత ఈ రెండు దేశాధినేతలు చర్చలు జరపనున్నారని చెప్పారు. మరోవైపు రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి ఏర్పరచే బాధ్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అప్పగించినట్లు ట్రంప్‌ తెలిపారు.

Updated Date - Apr 17 , 2026 | 03:41 AM