Home » DK Shivakumar
కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎటూ తేల్చలేకపోయింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి...
కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని, త్వరలో జరుగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు అవకాశాలపై ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం నాయకత్వ మార్పుపై ఇంతవరకూ పెదవి విప్పనప్పటికీ దీనిపై చర్చించేందుకు సీనియర్ నేతలిద్దరినీ ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచింది.
తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు తోసిపుచ్చారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనుండటంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది.
నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.
డీకే శివ కుమార్‌తో తనది పాలు, తేనె సంబంధం అని తమ నెవరూ విడదీయలేరని సీఎం సిద్దరామయ్య అన్నారు.