Home » Dharmavaram
మం డలంలోని ఉప్పునేసిన పల్లిలో లక్ష్మీకొల్హాపురమ్మ ఆలయంలో మంగళవా రం ప్రత్యేక పూజలు చే శారు. ఆలయ పూజారి వన్నూరప్ప మూల విరా ట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మహిళ భక్తులు బోనాలు సమర్పించారు.
జనసేన పార్టీ అధి నేత, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్తపేట వెంకటేశ్వరస్వామి ఆల యలో పూజలు నిర్వహించి, పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌కట్ చేశారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెరగని ముద్ర వేశారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సంబరాలు చేసుకున్నారు.
పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం ఆధ్వానంగా తయారయింది. నూతన భవనాలు కట్టించే ఆ శాఖ కార్యాలయంలో బూజుపట్టిన గదులు, ఆధ్వానంగా మరుగుదొడ్లు, ఆవరణం చుట్టూ పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రత రాజ్యమేలుతున్నాయి. వర్షం వస్తే కార్యాలయంలోని గదులు కారుతున్నా యి.
మండలకేంద్రంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీటీ ఆధ్వర్యంలో చిల్డ్రన హోం విద్యార్థిని విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖోఖో, స్కిప్పింగ్, రన్నింగ్, సైకలింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో 21మంది విద్యార్థులు, 22 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
పట్ణణంలోని మా ర్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో ఆదివారం రాఽధాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మం దిరంలో కొలువుదీరిన జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి ప్రతిమలకు ముందుగా అభిషేకాలు చేశారు. అందంగా అలంకరించి, పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగింది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అలస్యమవు తోంది. అలాగే కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టుతో పాటు సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు కార్యాలయ అధికారులు తెలుపుతున్నారు.
గణేశ నిమజ్జనాన్ని ఐదో రోజు ఆదివారం పుట్టపర్తి, ధర్మవరంలో ఉల్లా సంగా నిర్వహించారు.ధర్మవరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విగ్ర హాలను ట్రాక్టర్లపై, ఆటోలపై ఉంచి నిమజ్జనానికి తీసుకెళ్లారు. డీఎస్పీ హే మంత కుమార్ ఆధ్వర్యంలో సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప గట్టి బందో బస్తు నిర్వహించారు.
పరిటాల రవి వ్యక్తి కాదు... ఒక శక్తి అని టీడీపీ నా యకులు కొనియాడారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 67వ జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగో రోజు శనివారం నిమజ్జనం చేశారు.