GOD: రామలింగేశ్వరస్వామి ప్రతిష్ఠ
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:08 AM
మండలపరిధిలోని అ నంతసాగరం గ్రామంలో నూత నంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం రామలింగే శ్వరస్వామి, అ మ్మవారు, వినా యకుడు, కుమారస్వామి విగ్రహాల తో పాటు ధ్వజ స్తంభ ప్రతిష్ఠను ఘంనగా నిర్వహించారు. శుక్రవా రం నుంచి మూడు రోజు ల పాటు హోమాలు వి విధ పూజా కార్యక్రమా లను వేదిపండితులు ని ర్వహించారు.
బత్తలపల్లి,నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని అ నంతసాగరం గ్రామంలో నూత నంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం రామలింగే శ్వరస్వామి, అ మ్మవారు, వినా యకుడు, కుమారస్వామి విగ్రహాల తో పాటు ధ్వజ స్తంభ ప్రతిష్ఠను ఘంనగా నిర్వహించారు. శుక్రవా రం నుంచి మూడు రోజు ల పాటు హోమాలు వి విధ పూజా కార్యక్రమా లను వేదిపండితులు ని ర్వహించారు. ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ, సాయంత్ర జ్వాలాతోరణం నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామికి కొబ్బరి కాయలు కొట్టించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఎస్‌ఐ సోమశేఖర్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమములో టీడీపీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, నాయకులు మంజుల వెంకటేశు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.