GOD: అఖండ కార్తీక దీపోత్సవం
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:06 AM
మండలంలోని ఏకపాదంపల్లిలో శుక్రవారం సాయంత్రం నారసింహ నామం మార్మోగింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉదయం నుం చి గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజ లు, అన్నదానం నిర్వహించారు. సాయం త్రం 6గంటలకు ఆ కాశదీపం వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని పురోహితుడు అశోక్ శర్మ ప్రారంభించారు.
తాడిమర్రి, నవంబరు 14(ఆంఽధ్రజ్యోతి): మండలంలోని ఏకపాదంపల్లిలో శుక్రవారం సాయంత్రం నారసింహ నామం మార్మోగింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉదయం నుం చి గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజ లు, అన్నదానం నిర్వహించారు. సాయం త్రం 6గంటలకు ఆ కాశదీపం వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని పురోహితుడు అశోక్ శర్మ ప్రారంభించారు. గ్రామం మొత్తం భక్తులతో నిండిపోయింది. గ్రామ పెద్ద లు, ప్రజల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయం లో లక్ష్మీనరసింహస్వామి, స్వామివారి పాదం, ఆంజనేయస్వామి, ఈశ్వరుడిని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తాడిమర్రి పోలీసులు పటిష్టభద్రత నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....