TALENT: రాష్ట్ర స్థాయిలో ధర్మవరం విద్యార్థి ప్రతిభ
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:52 PM
పట్టణంలోని శాంతి నగర్ మున్సిప ల్ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చ దువుతున్న శంకరపు గణేశ రాష్ట్రస్థాయి సైన్స సెమినార్‌లో ప్రతిభ కనబరచారని ఆ పాఠశాల హెచఎం ఉమాపతి, సైన్స ఉపాధ్యాయులు ఎస్‌బీ రేఖ, ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి గణేశను గురువారం పాఠశాల లో వారు అభినందించారు.
ధర్మవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శాంతి నగర్ మున్సిప ల్ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చ దువుతున్న శంకరపు గణేశ రాష్ట్రస్థాయి సైన్స సెమినార్‌లో ప్రతిభ కనబరచారని ఆ పాఠశాల హెచఎం ఉమాపతి, సైన్స ఉపాధ్యాయులు ఎస్‌బీ రేఖ, ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి గణేశను గురువారం పాఠశాల లో వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.... గత నెల 17వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి లో నిర్వహించిన సైన్స సెమినార్‌లో క్వాంటమ్, జనరల్ కంప్యూ టర్ మధ్య తేడాను వివరించాడన్నారు. దీంతో విద్యార్థి గణేశను సమగ్రశిక్ష తరపున డిసెంబరు 27 నుంచి జనవరి 4వతేదీ వరకు గుజరాతకు సైన్స టూర్‌పై వెళ్తున్నట్టు హెచఎం, సైన్స ఉపాద్యాయులు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....