HANDLOOM: చేనేత కార్మికుల ఏళ్ల కల సాకారం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:59 PM
ఽనియోజకవర్గంలోని చేనేత కార్మికుల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైందని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్‌కు భూమి కేటాయింపు కోసం రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడంతో సోమవారం స్థానిక కదిరిగేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్, మంత్రి సత్యకుమార్‌యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ధర్మవరం, నవంబరు 10(ఆంఽధ్రజ్యోతి): ఽనియోజకవర్గంలోని చేనేత కార్మికుల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైందని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్‌కు భూమి కేటాయింపు కోసం రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడంతో సోమవారం స్థానిక కదిరిగేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్, మంత్రి సత్యకుమార్‌యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌కు భూమి కేటాయింపు చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఇందుకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ చూపారన్నారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి ఇచ్చిన హామీని నిల బెట్టుకున్నారన్నారు. బీజేపీ నాయకులు జింకాచంద్రశేఖర్, గొట్లూరు చంద్ర, గుండాపుల్లయ్య, డోలారాజారెడ్డి, పోతుకుంటరాజు, బిల్లేశీన, జనసేన నాయకులు అడ్డగిరి శ్యాంకుమార్, రాజారెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....