EMPLOYEES: పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:27 AM
తమకు రావాల్సిన ఇంక్రిమెం ట్లు, అరియర్స్, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని మున్సిపాలిటీ పరి ధిలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులకు డిమాండ్ చేశారు. ఐదు నెలల ఇంక్రిమెంట్లతో పాటు అరియర్స్, మెడికల్ బిల్లుల మంజూరులో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారంటూ మంగళవారం ముస్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్, ధర్నా
ధర్మవరం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తమకు రావాల్సిన ఇంక్రిమెం ట్లు, అరియర్స్, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని మున్సిపాలిటీ పరి ధిలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులకు డిమాండ్ చేశారు. ఐదు నెలల ఇంక్రిమెంట్లతో పాటు అరియర్స్, మెడికల్ బిల్లుల మంజూరులో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారంటూ మంగళవారం ముస్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇంక్రిమెంట్లు, జీతాలు అమలు కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉద్యోగులు సమర్పించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు కూడా సంబంధిత శాఖల్లో అనవసరంగా పెండింగ్‌లో ఉంచారన్నారు. ఫలితంగా వైద్యఖర్చులను భరించాల్సిన పరిస్థితి తమకు ఏర్పడిందన్నారు. వీటిపై మున్సిపల్ కమిషనర్, పరిపా లన అధికారులకు ఎన్ని సార్లు తెలియజేసినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో ఇంక్రిమెంట్ బిల్లులు మంజూరయ్యాయని, ఒక్క ధర్మవరంలోనే కాలేదన్నారు. అనంతరం అధికారులు వచ్చి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగానే సచివాలయ ఉద్యోగులు ధర్నా విరమించారు.