GOD: వైభవంగా కార్తీక వనభోజనాలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:18 AM
మండలం లోని కుణుతూరులో పురాతన చంద్రమౌళీశ్వర స్వామి ఆల యంలో ఆదివారం ధాత్రి నారాయణ పూజ, అభిషేకాలు, హో మాలు, కార్తీక వనభోజనాల ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అర్చకులు రాఘవ శర్మ, ఆయన శిష్య బృందం వేద మంత్రాల నడుమ నిర్వహిం చారు. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామస్థులతో పాటు ధర్మవరం పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ధర్మవరం రూరల్, నవంబరు, 9(ఆంధ్రజ్యోతి): మండలం లోని కుణుతూరులో పురాతన చంద్రమౌళీశ్వర స్వామి ఆల యంలో ఆదివారం ధాత్రి నారాయణ పూజ, అభిషేకాలు, హో మాలు, కార్తీక వనభోజనాల ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అర్చకులు రాఘవ శర్మ, ఆయన శిష్య బృందం వేద మంత్రాల నడుమ నిర్వహిం చారు. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామస్థులతో పాటు ధర్మవరం పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా ఆలయంలో చంద్రమౌళీ శ్వర స్వామి లింగాన్ని ప్రత్యేకంగా అలకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, ఆలయం వద్ద దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, భక్త జనం పాల్గొన్నారు.