BJP: బీజేపీ నాయకుల సంబరాలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:19 AM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాదించడంతో బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ బాణాసంచా కాల్చి, స్వీట్లను తినిపించుకున్నారు.
ధర్మవరం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాదించడంతో బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ బాణాసంచా కాల్చి, స్వీట్లను తినిపించుకున్నారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు మాట్లాడుతూ... ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన ఆపార విశ్వాసమే ఈ భారీ విజయానికి కారణమన్నారు. బీజేపీ నాయకులు జింకాచంద్ర, ఓబుళేశు, డోలారాజారెడ్డి, సాకేచంద్ర, బాస్కర్, పుల్లయ్య, నాగభూషణ ఆచారీ,ప్రవీన, నబీరసూల్, చంద్రమౌళి, కొంక నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: బీహార్‌లో ఎనడీఏ కూటమి గెలుపు సాధించడం పట్ల శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఇడగొట్టు వీరాంజినేయులు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక అంబేడ్కర్ కూడలిలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఆ పార్టీ మండల నాయకులు రంగారెడ్డి, అశ్వత్థప్ప, వెంకటరమణ, చలపతి, నరేష్, లక్ష్మీనారాయణ, లక్ష్మీపతిరెడ్డి, కిష్టప్ప, అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....