LIBRARY: గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:23 AM
గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ధర్మవరం గ్రంఽథాలయ కమిటీ చైర్మన చింతపులుసు పెద్దన్న, ఎంఈఓ-1,2లు రాజేశ్వరి, గోపాల్‌నాయక్ పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
(ఆంఽధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ధర్మవరం గ్రంఽథాలయ కమిటీ చైర్మన చింతపులుసు పెద్దన్న, ఎంఈఓ-1,2లు రాజేశ్వరి, గోపాల్‌నాయక్ పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. నె హ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు మునుపు ర్యాలీ నిర్వహించారు. అలాగే నల్లమాడలో గ్రంథాలయ అధికారి శకుంతల, గాండ్లపెంటలో గ్రంఽథాలయ అధికారి శాంతమ్మ, నంబులపూలకుంటలో గ్రంథాలయ అఽధికారి ఫరియాబాను ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. నెహ్రూచిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గ్రంథాలయ అఽధికారిని ఫరియాబాను, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగూ తూర్పునడింపల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....