Home » Cyclone
ఈసారి కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నష్ట నివారణ చర్యలను చాలా పకడ్బంధీగా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపానుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలిందని వెల్లడించారు ప్రఖర్ జైన్.
సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని.. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160 కి.మీ, కాకినాడకు 240 కి.మీ, విశాఖపట్నానికి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుపాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎన్డీయే శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచనలు చేశారు.
వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేశ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
దాదాపు 6 వేల మందిని తరలించేందుకు 120 పునరావాసు కేంద్రాలు ఏర్పాటు చేవారు. అమలాపురం, సఖినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో వంద కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో భారీ వర్షం కురుస్తుందని చెబుతున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని..
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.