Home » Cyber Crime
ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఓ వృద్ధురాలిని నమ్మించి రూ.57.43లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్టాక్ బ్రోకింగ్ పేరిట మహిళా వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కతార్‌లో ఉంటున్న మీ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, వెంటనే డబ్బు పంపాలని ఓ మహిళను భయపెట్టిన సైబర్ నేరగాడు ఆమె నుంచి రూ. 2లక్షలు కాజేశాడు. మెహిదీపట్నం ప్రాంతం లో ఉంటున్న మహిళ (38) సోదరుడు కతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
యూజర్‌కు తెలీకుండానే కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ చేసి డబ్బులు తస్కరించేందుకు ప్రయత్నించాడో సైబర్ క్రిమినల్. ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే, ఇలాంటి స్మామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
పెళ్లి రోజున భార్యకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చిన ఓ లాయర్‌కు దిమ్మతిరిగినంత పనైంది. ఆ స్మార్ట్‌ఫోన్ ఓ సైబర్ క్రైమ్‌తో లింక్ అయి ఉందంటూ సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో లాయర్ అవాక్కయిపోయారు. కోల్‌కతాలో ఈ ఉదంతం వెలుగు చూసింది.
77 ఏళ్ల ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్ల ముఠా.. రూ.53 లక్షలను కొల్లగొట్టిన ఉదంతమిది.
యూకే నుంచి డైమండ్ రింగ్, బంగారం, ఖరీదైన దుస్తులు పంపుతున్నానంటూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.2.48 లక్షలు కొల్లగొట్టారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వృద్ధితో పాటు మోసాల రేటు కూడా వేగంగా పెరుగుతోంది. ఆన్‌లైన్ సేవల వాడకంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ మోసాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మీ అకౌంట్ హ్యాక్ అయిందా (Account Hacked) లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన నగరానికి చెందిన యువకుడు రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన యువకుడు (28)కు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో ఓ యువతి పరిచయమైంది.
సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న తరుణంలో నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల పేర్లు చెప్పి మోసాలకు తెగబడుతున్నారు.