Hyderabad: ఆర్డర్ క్యాన్సిల్.. డబ్బు వాపస్ పేరుతో సైబర్ నయా మోసం
ABN , Publish Date - Aug 21 , 2025 | 08:10 AM
సైబర్ నేరగాళ్లు ఫుడ్ డెలివరీ యాప్‌లను సైతం మోసాలకు వాడుకుంటున్నారు. నగరానికి చెందిన వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించాడు. ఫుడ్ ఆర్డర్ సమాచారం కానీ, బ్యాంకు నుంచి డబ్బు చెల్లింపులకు చెందిన సమాచారం కానీ రాలేదు.
- ఫోన్ హ్యాక్ చేసి ఖాతాలు ఖాళీ చేసిన వైనం
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఫుడ్ డెలివరీ యాప్‌లను సైతం మోసాలకు వాడుకుంటున్నారు. నగరానికి చెందిన వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించాడు. ఫుడ్ ఆర్డర్ సమాచారం కానీ, బ్యాంకు నుంచి డబ్బు చెల్లింపులకు చెందిన సమాచారం కానీ రాలేదు. కొద్ది సేపటికి ఆ యాప్ కస్టమర్ కేర్(App Customer Care) ప్రతినిధి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. డెలివరీ చేయలేని కారణంగా ఆర్డర్ క్యాన్సిల్ అయిందన్నాడు.

డబ్బు వాపస్ చేస్తామని వివరాలు నమోదు చేయాలంటూ ఓ లింక్‌ను పంపాడు. డబ్బు రీఫండ్ కావాలంటే ఆ లింక్ ద్వారా రూ.1 చెల్లించాలని సూచించాడు. ఆర్డర్ వివరాలు సరిగా చెప్పడంతో నమ్మిన బాధితుడు అతడు పంపినట్లుగా రూ.1 చెల్లించాడు. వెంటనే మొబైల్ హ్యాక్ అయింది. బాధితుడి ఐదు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేశారు. ఇది సైబర్ మోసమని గుర్తించిన బాధితుడు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News