Hyderabad: అమ్మో.. రూ. 27 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:48 AM
ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లు వల విసిరి, ఆ తర్వాత పెట్టుబడులను పెట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.27లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
- పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వల..
- పెట్టుబడుల పేరుతో బురిడీ
- రూ. 27 లక్షలు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లు వల విసిరి, ఆ తర్వాత పెట్టుబడులను పెట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.27లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్(Charminar) ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఆన్‌లైన్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించొచ్చని టెలీగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌ను క్లిక్ చేసి వారు చెప్పిన విధంగా చేసి టాస్క్‌లు పూర్తి చేశాడు.
ప్రారంభంలో కొంత ఆదాయం ఇచ్చిన నేరగాళ్లు ఆ తర్వాత అసలు దందాకు తెరతీశారు. బాధితుడిని వేలం లాట్ ఇన్వెస్టిమెంట్ స్కీమ్‌లో యాడ్ చేశారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని, అటు పార్ట్‌టైమ్ ఉద్యోగంతో పాటు.. ఇటు ఇన్వెస్టిమెంట్‌లోనూ లాభాలు దక్కించుకోవచ్చని నమ్మించారు. ప్రారంభంలో చిన్న మొత్తాల్లో పెట్టుబడులు స్వీకరించి పెద్ద మొత్తంలో లాభాలు చూపించారు.

నమ్మకం కుదిరాక విడతల వారీగా బాఽధితుడి ద్వారా ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టించారు. సుమారు రూ. 27లక్షల వరకు పెట్టిన పెట్టుబడులకు వర్చువల్‌గా లాభాలు వచ్చినట్లు చూపించినప్పటికీ విత్‌డ్రా ఆప్షన్ ఇవ్వలేదు. దీనిపై వారిని నిలదీస్తే కాంటాక్టును కట్ చేశారు. ఇదంతా మోసమని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News