Share News

Mumbai Teen Duped: ప్రియుడికోసం లక్షలు పోగొట్టుకున్న యువతి..

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:54 PM

Mumbai Teen Duped: యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వారి బలవంతం వల్ల ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఇక, అప్పటినుంచి నరకం చూస్తోంది. ప్రియుడ్ని విడిచి ఉండలేని స్థితిలోకి వచ్చింది.

Mumbai Teen Duped: ప్రియుడికోసం లక్షలు పోగొట్టుకున్న యువతి..
Mumbai Teen Duped:

ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం చదువురాని వాళ్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా సైబర్ నేరాలకు గురవుతున్నారు. తాజాగా, ఓ యువతి ప్రియుడి కోసం లక్షల రూపాయలు పొగొట్టుకుంది. సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించి 16 లక్షలు దోచేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన 18 ఏళ్ల ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది.


ఈ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వారి బలవంతం వల్ల ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఇక, అప్పటినుంచి నరకం చూస్తోంది. ప్రియుడ్ని విడిచి ఉండలేని స్థితిలోకి వచ్చింది. ఓ రోజు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మౌలానా ఇర్ఫాన్ ఖాన్జీ’ పెట్టిన ఓ పోస్టు చూసింది. ‘మీరు మీ లవర్‌నుంచి విడిపోయారా? మిమ్మల్ని 24 గంట్లోనే కలుపుతాం’ అని ఆ పోస్టులో ఉంది. అది ఒక ఫేక్ అకౌంట్. వికాస్ మొఘవల్, మనోజ్ నాగ్‌పాల్‌‌లు లవ్ ఫెయిల్యూర్స్‌ను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ పోస్టు చూసి యువతి వారిని కాంటాక్ట్ అయింది. వారు ఆమెను బాగా నమ్మించారు. కొన్ని పూజలు చేస్తే ప్రియుడు తిరిగి వస్తాడని నమ్మించారు.


ఆమెతో వెండి కుండ, బంగారం దీపం కొనించారు. వాటిని కొనడానికి డబ్బుకోసం ఆమె ఇంట్లోని విలువైన వస్తువుల్ని దొంగతనం చేసింది. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుల్ని ఆన్‌లైన్ ద్వారా వారికి పంపింది. ఇంట్లోని విలువైన వస్తువులు కనిపించకుండా పోవటంతో యువతి తల్లి తహవిన్ ఇరాకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నేరానికి పాల్పడ్డ వికాస్ మొఘవల్, మనోజ్ నాగ్‌పాల్‌లను అరెస్ట్ చేశారు. వారినుంచి 129 గ్రాముల బంగారం, 3.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

కూలీ సినిమా రికార్డ్.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..

పవన్‌ను బంధించింది ఎవరు?

Updated Date - Aug 10 , 2025 | 12:58 PM