Share News

Rajinikanth Coolie: కూలీ సినిమా రికార్డ్.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:55 AM

Rajinikanth Coolie: అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ కూలీ రికార్డు నెలకొల్పింది. ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. కేరళలో ‘కూలీ’ హవా మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడానికి జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Rajinikanth Coolie: కూలీ సినిమా రికార్డ్.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్..
Rajinikanth Coolie

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘కూలీ’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఊహించని స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాను దాదాపు 375 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు. ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు సంపాదించింది. ఇంటర్‌నేషనల్, డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ రైట్స్ కలుపుకుని బడ్జెట్‌ మొత్తంలోని 66 శాతం విడుదలకు ముందే కొల్లగొట్టింది. కేవలం ఇంటర్‌నేషనల్ రైట్స్ మాత్రమే 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.


అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ కూలీ రికార్డు నెలకొల్పింది. ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. కేరళలో ‘కూలీ’ హవా మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడానికి జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం కూడా అలాంటి పరిస్థితే ఉంది. శుక్రవారం కేరళ, త్రిస్సూర్‌లోని ఓ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం జనం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్షర్స్ విడుదల చేసింది.


కాగా, ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కింగ్ నాగార్జున ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రలో నటించారు. లోకష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి

పవన్‌ను బంధించింది ఎవరు?

ఏపీ, తెలంగాణలో వర్షాల జోరు.. ఆగస్టు 14-17 వరకు హై అలర్ట్

Updated Date - Aug 10 , 2025 | 12:00 PM