Cbercrime: సైబర్ మోసాలపై కేంద్రం నజర్
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:33 AM
ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. సైబర్ మోసాల కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని
పైలెట్ ప్రాజెక్టుకు తెలంగాణ ఎంపిక
త్వరలో రాష్ట్రంలో ఒక రోజంతా సెమినార్
దేశ ప్రజల్లో చైతన్యానికి కార్యక్రమాలు
సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ ‘కమాండో’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. సైబర్ మోసాల కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సైబర్ కేటుగాళ్లల నేరాలకు ఉపయోగించే సిమ్‌కార్డులను తక్షణమే బ్లాక్ చేసే అధికారాలను జిల్లా స్థాయిలో ఎస్పీలకు దఖలుపరచాలని నిర్ణయించినట్లు వివరించారు. కేటుగాళ్ల లొకేషన్లు, బ్యాంకింగ్, టెలికాం సోర్సుల వివరాలను దేశంలోని అన్ని పోలీ్‌సస్టేషన్లకు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలోని తన కార్యాలయంలో 14సీ (భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం) ఆధ్వర్యంలో అమల్లోకి తీసుకొచ్చిన సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ కమాండో ప్రోగ్రామ్‌పై హోంశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల మఽధ్య సమన్వయానికి ‘సమన్వయ్ ప్లాట్‌ఫాం’ దోహదపడుతుందని అధికారులు బండి సంజయ్‌కి వివరించారు. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. గ్రామగ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం తెలంగాణ ను పైలట్‌ప్రాజెక్టుగా తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో తెలంగాణలో ఒక రోజంతా సెమెనార్‌ను ఏర్పాటు చేస్తామన్నా రు. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న హోంగార్డు మొద లు, ఎస్పీస్థాయి అధికారితో కలిపి.. ఒక్కో జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేసి, వారికి అవగాహన కల్పిస్తామన్నారు. వీరంతా టీచర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు.. ఇలా వివిధ రంగాల వారి కోసం సెమినార్లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ బృందాలు గ్రామ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తాయన్నారు.