Share News

Hyderabad: నగ్న వీడియోల పేరిట బెదిరించి...

ABN , Publish Date - Aug 19 , 2025 | 06:54 AM

డేటింగ్‌ యాప్‌ల మాటున సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. యాప్‌లో యువతితో వీడియోకాల్‌లో మాట్లాడిన యువకుడిని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు రూ.1.80 లక్షలు వసూలు చేశారు. గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు (24) డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన శివానితో చాటింగ్‌ చేస్తూ, వాట్సాప్ లో తరచూ మాట్లాడేవాడు.

Hyderabad: నగ్న వీడియోల పేరిట బెదిరించి...

- రూ.1.80 లక్షలు వసూలు

- డేటింగ్‌ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్ల వల

హైదరాబాద్‌ సిటీ: డేటింగ్‌ యాప్‌ల మాటున సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. యాప్‌లో యువతితో వీడియోకాల్‌లో మాట్లాడిన యువకుడిని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.80 లక్షలు వసూలు చేశారు. గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు (24) డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన శివానితో చాటింగ్‌ చేస్తూ, వాట్సాప్‏(WhatsApp)లో తరచూ మాట్లాడేవాడు. తాను పుణేలో ఉంటున్నానని చెప్పిన యువతి..


త్వరలో నగరానికి వస్తున్నానని చెప్పడంతో సదరు యువకుడు వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. మరుసటిరోజు వాట్సాప్‌ ద్వారా అతడి నగ్న వీడియోలు పంపి సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకుంటే న్యూడ్‌ వీడియోలను సోషల్‌ మీడియా వేదికల్లో పెడతామని భయపెట్టారు. సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేసిన విధంగా రూ.50వేలు వారు సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత వీడియో డిలీట్‌ చేయాలంటే మరో రూ. 70 కావాలని చెబితే ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు.


city1.2.jpg

తర్వాత మరో రూ.60వేలు వారికి సమర్పించుకున్నాడు. మళ్లీ రూ.1.30 లక్షలు డిమాండ్‌ చేయడంతో వారి వేధింపులు తాళలేని బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాను వీడియో కాల్‌లో కేవలం ముఖం మాత్రమే చూపానని, ఫేస్‌బుక్‌లో ఉన్న వీడియోలను తీసుకొని మార్ఫింగ్‌ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 07:00 AM