Home » CWG 2026
గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో జ్ఞానేశ్వరీ యాదవ్ రజత పతకం సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి తమిళనాడు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రూ.30 లక్షల నగదు బహుమతిని అందిస్తున్నట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వెల్లడించారు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం వచ్చింది. 48 కిలోల విభాగంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది.
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం అనహత్ సింగ్ స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా అనహత్ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రిషికంఠ సింగ్ రజత పతకం సాధించాడు.
కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్‌కు చెందిన యువ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్‌కు పెను ప్రమాదం తప్పింది. పురుషుల జట్టు జిమ్నాస్టిక్స్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హారిజంటల్ బార్‌పై ప్రదర్శన చేస్తూ పట్టుతప్పి తలకిందులుగా నేలపై పడిపోయాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. బిహార్‌కు చెందిన పారా అథ్లెట్ ఝండూ కుమార్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు.
భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత తులిక మాన్‌కు షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సస్పెన్షన్ వేటు వేసింది.