Share News

కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి

ABN , Publish Date - Jul 28 , 2026 | 09:40 AM

గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి
Manidipalli Ramprasad Reddy

అమరావతి, జులై 28: గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ రికార్డుతో పాటు రజత పతకం సాధించడం అజయ్ బాబు ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు.


క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులు.. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

నన్ను చంపాలని ప్రయత్నించారు: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు..

ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 10:03 AM