Share News

ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ

ABN , Publish Date - Jul 28 , 2026 | 09:32 AM

రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ మండలం ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రసిద్ధ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి చొరబడిన దుండగులు.. గుడిని గుల్ల చేశారు.

ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ
Rangareddy temple theft

రంగారెడ్డి, జులై 28: జిల్లాలోని గండిపేట్ మండలం ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రసిద్ధ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి చొరబడిన దుండగులు.. గుడిని గుల్ల చేశారు. అమ్మవారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు హుండీని దోచుకెళ్లారు. దోపిడీ విలువ సుమారు రూ.20 లక్షల పైనే ఉంటుందని అంచనా. ఆధారాలు దొరక్కుండా ఆలయంలోని సీసీ కెమెరాల డీవీఆర్ (DVR) కూడా దుండగులు మాయం చేశారు. పక్కా పథకం ప్రకారం, ఆలయ రూట్ మ్యాప్‌పై అవగాహన ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని ఆలయ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సమాచారం అందిన వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చేపట్టారు. అమ్మవారి సొత్తును దోచుకెళ్లిన పాపాత్ములను వెంటనే పట్టుకోవాలని భక్తులు, గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

నీట్ నిరసనకారులకు ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అస్సాం, బిహార్

నన్ను చంపాలని ప్రయత్నించారు: మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 09:42 AM