కామన్వెల్త్ గేమ్స్ 2026: భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
ABN , Publish Date - Jul 26 , 2026 | 08:44 PM
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం వచ్చింది. 48 కిలోల విభాగంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం వచ్చింది. 48 కిలోల విభాగంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి గేమ్స్ రికార్డు నెలకొల్పిన చాను.. క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు విజయవంతంగా లిఫ్ట్ చేసింది. మొత్తంగా 190 కేజీలు ఎత్తి మరో గేమ్స్ రికార్డును సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
నైజీరియా రూత్ అసుక్వో న్యోంగ్(168 కేజీలు) రజతం, మలేసియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ(167 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. అయితే నేడు భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ఇది రెండో పతకం కావడం విశేషం. అంతకుముందు పురుషుల 60 కేజీల విభాగంలో రిషికంఠ సింగ్ రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్