Home » CWG 2026
గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎనిమిదో రోజు క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఆరంభమైంది. భారత ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా పురుషుల జావెలెన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించాడు.
కష్టాలు లేని అథ్లెట్ ఎవరూ ఉండరు. ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ఉన్నత స్థానాలకు చేరతారు. కొందరికి కుటుంబపరంగా.. మరికొందరికి ఆటపరంగా అడ్డంకులు వస్తాయి. వాటిని ఎదుర్కొని విజేతలుగా నిలుస్తారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే పారా అథ్లెట్ దిలీప్ గవిత్
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాల్గొనే ముందు భారత జుడో జట్టుకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. భారత్ నుంచి గ్లాస్గోకు చేరుకున్న 16 మంది సభ్యుల జట్టులో పలువురు జుడోకాలకు చెందిన లగేజీ గమ్యస్థానానికి చేరకపోవడంతో ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 66 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు.
కామన్వెల్త్ గేమ్స్2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చరిత్రాత్మక విజయం సాధించాడు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 స్విమ్మింగ్ పోటీల్లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.
గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ అజయ్ బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తండ్రి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ క్రీడా వారసత్వాన్ని అజయ్.. విజయవంతంగా కొనసాగించారని కొనియాడారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పారా అథ్లెట్ షర్మిల ధన్‌ఖడ్ చరిత్ర సృష్టించింది. మహిళా షాట్‌పుట్ విభాగంలో స్వర్ణం పతకం సాధించింది. దీంతో కామన్వెల్త్ గేమ్ లో పారా అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం అందించిన తొలి భారత క్రీడాకారిణిగా షర్మిల అరుదైన ఘనత సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకాన్ని అత్యంత స్వల్ప తేడాతో చేజార్చుకున్నా ఛాంపియన్‌గా నిలిచావని కొనియాడారు.
ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ వ్యక్తి కాంస్య పతకంతో దేశ కీర్తిని పెంచాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే కామన్వెల్త్ వేదికపై ఆయన తనయుడు రజత పతకంతో సంచలనం సృష్టించాడు. ఎవరంటే..