Share News

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:43 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 66 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు.

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
Sakshi Chaudhary, Arundhati Chaudhary

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 66 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు. ఇప్పటికే లవ్లీనా బోర్గొహైన్ (75 కేజీలు), ప్రియా ఘంఘాస్ (60 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జాదుమణి సింగ్ (55 కేజీలు) కూడా సెమీస్‌కు చేరడంతో భారత్‌కు పతకాల పంట పండింది. బాక్సింగ్‌లో భారత్‌కు ఐదు పతకాలు రావడం లాంఛనమైంది.


క్వార్టర్ ఫైనల్లో సాక్షి చౌదరి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్‌లిన్ ఫ్రయర్స్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. తన ఎత్తు, రీచ్‌ను సమర్థంగా వినియోగించుకున్న సాక్షి ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడినా, చక్కటి ఫుట్‌వర్క్‌, కచ్చితమైన పంచ్‌లతో సాక్షి మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో అరుంధతి చౌదరి న్యూజిలాండ్ బాక్సర్ మోర్గాన్ హెండర్సన్‌పై 3-1తో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అరుంధతి చివరికి పైచేయి సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్‌ 2027: స్క్వాడ్ సైజ్‌ను పెంచండి.. ఐసీసీకి ఆసీస్ కోచ్ విజ్ఞప్తి

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో సంచలనం.. అసలేంటీ ‘క్లికీ పాంటింగ్’ వివాదం?

Updated Date - Jul 29 , 2026 | 06:58 PM