Share News

‘ప్రపంచ వేదికపై మరెన్నో విజయాలు సాధించాలి’.. అజయ్‌కు పవన్ అభినందనలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:19 AM

కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకాన్ని అత్యంత స్వల్ప తేడాతో చేజార్చుకున్నా ఛాంపియన్‌గా నిలిచావని కొనియాడారు.

‘ప్రపంచ వేదికపై మరెన్నో విజయాలు సాధించాలి’.. అజయ్‌కు పవన్ అభినందనలు
Deputy CM Pawan Kalyan

అమరావతి, జులై 28: కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. గ్లాస్గోలో పురుషుల 79 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి.. భారతదేశానికి మరో కీర్తిని తెచ్చిపెట్టిన అజయ్ బాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్వర్ణ పతకాన్ని అత్యంత స్వల్ప తేడాతో చేజార్చుకున్నా ఛాంపియన్‌గా నిలిచావని కొనియాడారు. అజయ్ బాబు ప్రదర్శన.. ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.


అజయ్ బాబు.. విజయనగరం జిల్లా కీర్తిని ప్రపంచ వేదికపై చాటారని.. తండ్రి వల్లూరి శ్రీనివాసరావు క్రీడా వారసత్వాన్ని కొనసాగించారని పవన్ అన్నారు. భారతదేశానికి మరో గర్వకారణమైన విజయాన్ని అజయ్ అందించారన్నారు. తమ బిడ్డలలో ఒకరు భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందని అన్నారు. ప్రపంచ వేదికపై మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. అజయ్ బాబుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి

శివాని ఆత్మహత్య కేసు.. సూసైడ్‌ నోట్‌పై పోలీసుల విచారణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 11:50 AM