శివాని ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌పై పోలీసుల విచారణ
ABN , Publish Date - Jul 28 , 2026 | 10:51 AM
పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.
పోలవరం జిల్లా, జులై 28: జిల్లాలోని రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫొటో దిగిన మూడు రోజులకే శివాని ఆత్మహత్య చేసుకోవడాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్), క్లూస్ టీమ్స్.. సంఘటనా స్థలంలో అన్ని ఆధారాలను సేకరించారు.
శివాని రాసిన సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శివాని కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ‘అమ్మ, అన్నయ్య, వదిన, అమ్మమ్మ ఎప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి’ అంటూ శివాని సూసైట్ నోట్‌లో రాయడంపైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి
Read Latest AP News And Telugu News