Share News

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి

ABN , Publish Date - Jul 28 , 2026 | 10:09 AM

కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు జాతీయ రహదారిపై టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ సురేశ్ మృతి చెందారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ మృతి
Krishna district road accident

కృష్ణా జిల్లా, జులై 28: జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు జాతీయ రహదారిపై(కల్లపరు) టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేశ్(52) మృతి చెందారు. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున సురేశ్ దంపతులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య నున్న విమల దేవికి తీవ్ర గాయాలు అయ్యాయి.


సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సురేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన విమల దేవిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతుడు.. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సోదరుడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ

కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 10:19 AM