Home » CWG 2026
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్-57 ఫైనల్లో సోమన్ రాణా పసిడి పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం గెలిచాడు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తదుపరి ఈవెంట్ ఏంటని తెలుసుకునేందుకు క్రీడాభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. ఇవాళ బాక్సింగ్ విభాగంలో భారత్ ఈ రెండు పసిడి పతకాలను సాధించింది. మహిళల 54 కేజీలు, 57 కేజీల విభాగాల్లో భారత్ అథ్లెట్స్ గోల్డ్ మెడల్స్ గెలిచారు.
కామన్వెల్త్ గేమ్స్2026లో భారతదేశానికి పతకాలు అందించిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జావెలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రా, కాంస్య పతక విజేత యశ్వీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించాడు. హైజంప్ విభాగంలో ఫైనల్ పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో ఒక్క జంప్ కూడా నమోదు చేయలేక కన్నీళ్లతో మైదానాన్ని వీడిన తేజస్విన్.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే డెకాథ్లాన్‌లో చరిత్ర సృష్టించాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకోవడంపై స్పందించాడు. తనతో పాటు భారత అథ్లెట్ యశ్వీర్ సింగ్ కూడా పోడియంపై నిలవడం తనకెంతో ఆనందంగా అనిపించిందని తెలిపాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక్క బౌట్ కూడా గెలవకుండానే తువాలు దేశానికి చెందిన మహిళా బాక్సర్ తరోనా తఫాకీ కాంస్య పతకాన్ని అందుకుంది. దీంతో దక్షిణ పసిఫిక్‌లోని చిన్న ద్వీప దేశమైన తువాలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలి పతకాన్ని సొంతం చేసుకుంది.
భారత జావెలిన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎనిమిది పతకాలతో విజయవంతంగా ముగించింది. పురుషుల 110+ కిలోల విభాగంలో భారత అథ్లెట్ లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం సాధించింది. గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్ మూడో రౌండ్‌లో 58.65 మీటర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా ఆమెను కాంస్య పతకం వరించింది.