Home » Cricket news
ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.
నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.
ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అంతర్గతంగా రక్తస్రావం అవుతున్నట్టు గుర్తించిన వైద్యులు అతడిని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
గత ఐపీఎల్‌లో ఘోర ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పించి విషయం తెలిసిందే. అయితే తాజాగా కేకేఆర్‌కు కొత్త ప్రధాన కోచ్...
సిడ్నీ(Sydney)లో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. 105 బంతుల్లో అద్భుత సెంచరీ చేసి అదరగొట్టాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్ రాణా (4/39)తో రాణించడంతో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లందరూ వికెట్లు దక్కించుకోవడం విశేషం.
ఆధునిక క్రికెట్‌కు భారత్ కేంద్రంగా మారిందని, అక్కడివారికి ఆట పట్ల ఉన్న అంకిత భావమే అందుకు కారణమని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను భారీ ఆదాయ వనరుగా మార్చడంలో టీమిండియా కీలక పాత్ర పోషించిందని, భారత్‌లో క్రికెట్‌కు ఎప్పటికీ ఆదరణ తగ్గదని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు సిడ్నీలో చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలని కృతినిశ్చయంతో ఉంది.
అడిలైడ్ మ్యాచ్‌కు కుల్‌దీప్ యాదవ్‌ను ఎంపిక చేయకపోవడం నిజంగా అన్యాయమని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. హర్షిత్ లేదా నితీశ్ రెడ్డిలల్లో ఎవరో ఒకరినే ఎంపిక చేయాలని సూచించాడు.