మేం కొలంబో వెళ్తున్నాం
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:23 AM
పాకిస్థాన్‌తో ఈనెల 15న జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కోసం తాము కొలంబో వెళ్తున్నట్టు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురువారం స్పష్టంజేశాడు. కారణాలు చెప్పకుండా...
టీ20 ప్రపంచ కప్ రేపటి నుంచే
టిక్కెట్లు బుక్ అయ్యాయి
భారత్ కెప్టెన్ సూర్యకుమార్
కొలంబో/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌తో ఈనెల 15న జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కోసం తాము కొలంబో వెళ్తున్నట్టు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురువారం స్పష్టంజేశాడు. కారణాలు చెప్పకుండా..భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ హెచ్చరించింది కూడా. అయినా పాకిస్థాన్ తన నిర్ణయానికే మొగ్గు చూపుతోంది. ‘పాకిస్థాన్ నిర్ణయం నా నియంత్రణలో లేదు. 15న కొలంబోలో మేం పాకిస్థాన్‌తో ఆడాలని చెప్పారు. మా మైండ్ సెట్ చాలా స్పష్టంగా ఉంది. పాకిస్థాన్‌తో ఆడబోమని మేం చెప్పలేదు. కొలంబోకు మా టిక్కెట్లు రిజర్వ్ అయ్యాయి’ అని వెల్లడించాడు.
మా చేతుల్లో లేదు: ఆఘా
భారత్‌తో ఆడరాదన్న తమ బోర్డు నిర్ణయాన్ని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సమర్థించాడు. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, తమ చేతుల్లో ఏమీ లేదని అన్నాడు. దానిని తాము గౌరవించాలన్నాడు. భారత్‌తో నాకౌట్‌లో తలపడాల్సి వస్తే అన్న ప్రశ్నకు..అప్పుడూ ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నాడు.
మేం బంగ్లాదేశ్ వెంటే
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్
భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. ‘మేం ఎంతో ఆలోచించి..స్పష్టమైన వైఖరితోనే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాం. బంగ్లాకు పూర్తిగా అండగా ఉంటాం’ అని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌కు థ్యాంక్స్: బంగ్లా
భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒక్కటయ్యాయని వెల్లడైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ చేసిన పోస్ట్‌తో ఈ విషయం బహిర్గతమైంది. టీ20 వరల్డ్ కప్‌లో తమకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్‌కు నజ్రుల్ ఫేస్‌బుక్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.
ఐసీసీదే తప్పు: నాసిర్
ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తప్పుబట్టాడు. ‘మరో దేశంతో భారత్ ఆడేందుకు నిరాకరిస్తే ఆ జట్టుపైనా ఐసీసీ అలాంటి నిర్ణయమే ప్రకటిస్తుందా’ అని ప్రశ్నించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు