Share News

కుర్రాళ్లు కుమ్మేశారు

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:10 AM

కీలక మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకొన్న ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115) క్లాసిక్‌ శతకంతోపాటు వైభవ్‌ సూర్యవంశీ (68), కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (62) చెలరేగడంతో.. అండర్‌-19 వరల్డ్‌క్‌పలో...

కుర్రాళ్లు కుమ్మేశారు

రికార్డు ఛేదనతో ఫైనల్‌కు యువ భారత్‌

ఆరోన్‌ శతకం

రాణించిన వైభవ్‌, ఆయుష్‌

సెమీస్‌లో అఫ్ఘానిస్థాన్‌ చిత్తు

అండర్‌-19 వరల్డ్‌కప్‌

హరారే: కీలక మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకొన్న ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115) క్లాసిక్‌ శతకంతోపాటు వైభవ్‌ సూర్యవంశీ (68), కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (62) చెలరేగడంతో.. అండర్‌-19 వరల్డ్‌క్‌పలో యువ భారత్‌ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్లతో అఫ్ఘానిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్‌.. 10వ సారి టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అప్ఘాన్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 310 పరుగులు చేసింది. కనిష్క్‌, దీపేష్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఫైజల్‌ షినోజదా (110), ఉజైరుల్‌ నియాజాయ్‌ (101 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 రన్స్‌ జోడించడంతో అఫ్ఘాన్‌ స్కోరు 300 దాటింది. ఓపెనర్లు ఉస్మాన్‌ (39), ఖలీల్‌ (31) రాణించారు. భారీ ఛేదనలో భారత్‌ 41.1 ఓవర్లలో 311/3 స్కోరు చేసి నెగ్గింది.

సులువుగా కొట్టేశారు: ఛేదనలోభారత్‌కు ఆరోన్‌, వైభవ్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వైభవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను నియాజాయ్‌ చేజార్చగా.. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరోన్‌కు జీవనదానం లభించింది. చెలరేగుతున్న వైభవ్‌ను ఒమర్జాయ్‌ అవుట్‌ చేయడంతో.. తొలి పవర్‌ప్లేలో భారత్‌ 91/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. మధ్య ఓవర్లలో ఆరోన్‌, కెప్టెన్‌ ఆయుష్‌ రెండో వికెట్‌కు 114 రన్స్‌ జోడించడంతో జట్టు స్కోరు 200 మార్క్‌ దాటింది. హాఫ్‌ సెంచరీ చేసిన ఆయు్‌షను కూడా ఒమర్జాయ్‌ పెవిలియన్‌ చేర్చినా.. విహాన్‌ (38 నాటౌట్‌)తో కలసి ఆరోన్‌ జట్టును గెలుపు ముంగిట నిలబెట్టాడు. అయితే, సెంచరీ పూర్తి చేసుకొన్న ఆరోన్‌.. జద్రాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ, మల్హోత్రా, వేదాంత్‌ (5 నాటౌట్‌) మరో 53 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.


సంక్షిప్త స్కోర్లు

అఫ్ఘానిస్థాన్‌: 50 ఓవర్లలో 310/4 (ఫైజల్‌ 110, ఉజైరుల్‌ 101 నాటౌట్‌; కనిష్క్‌ 2/55, దీపేష్‌ 2/64).

భారత్‌: 41.1 ఓవర్లలో 311/3 (ఆరోన్‌ 115, వైభవ్‌ 68; నూరిస్థానీ ఒమర్జాయ్‌ 2/64).

1

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఇదే అత్యధిక ఛేదన. 2006లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్‌ ఛేదించిన 304 పరుగుల రికార్డును భారత్‌ అధిగమించింది.

2

ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి నమోదైన 621 పరుగులు.. టోర్నీ చరిత్రలో రెండో అత్యధికం. 2004లో చట్టోగ్రామ్‌లో జరిగిన ప్లేఆఫ్స్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ (340/5, 291/9) మ్యాచ్‌లో 631 రన్స్‌ నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 03:10 AM