Share News

ప్రాక్టీస్‌ అదుర్స్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:01 AM

దక్షిణాఫ్రికాతో భారత్‌ ప్రపంచ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అదిరింది. టాపార్డర్‌ బ్యాటర్లంతా సత్తా చాటారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో...

ప్రాక్టీస్‌ అదుర్స్‌

ఇషాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌

దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలుపు

టీ20 ప్రపంచ కప్‌ 2 రోజుల్లో

నవీ ముంబై: దక్షిణాఫ్రికాతో భారత్‌ ప్రపంచ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అదిరింది. టాపార్డర్‌ బ్యాటర్లంతా సత్తా చాటారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 240/5 స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (20 బంతుల్లో 53 రిటైర్డ్‌ అవుట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో వరల్డ్‌ కప్‌నకు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అభిషేక్‌ శర్మ (24 రిటైర్డ్‌ అవుట్‌)తో కలిసి తొలి వికెట్‌కు పవర్‌ ప్లేలోపే 80 రన్స్‌ జోడించాడు. తిలక్‌ వర్మ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) సహజశైలిలో ధాటిగా ఆడాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (30), వైస్‌-కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (35) దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 210/7 స్కోరుకే పరిమితమై ఓడింది. స్టబ్స్‌ (45 నాటౌట్‌), రికెల్టన్‌ (44), మార్‌క్రమ్‌ (38) మెరిశారు. హర్షిత్‌ రాణా ఒకటే ఓవర్‌ వేసి మైదానాన్ని వీడాడు. బుమ్రా అస్సలు బరిలోకే దిగలేదు.

భారత్‌: 20 ఓవర్లలో 240/5 (కిషన్‌ 53, తిలక్‌ వర్మ 45, అక్షర్‌ 35 నాటౌట్‌, హార్దిక్‌ 30, సూర్యకుమార్‌ 30, యాన్సెన్‌ 1/18, ఎంపాక 1/19, బాష్‌ 1/31, నోకియా 1/57).

దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 210/7 (స్టబ్స్‌ 45 నాటౌట్‌, రికెల్టన్‌ 44, అభిషేక్‌ 2/32, అక్షర్‌ 1/2, వరుణ్‌ 1/12, అర్ష్‌దీప్‌ 1/29, శివమ్‌ దూబే 1/57).

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 03:01 AM