Share News

ఒకటా.. రెండా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:05 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఆసక్తికర ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అద్భుతంగా ఆడుతూ టైటిల్‌ ఫైట్‌కు దూసుకొచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)..వరుసగా నాలుగోసారి...

ఒకటా.. రెండా?

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ నేడే

రా. 7.30 నుంచి

తొలి ట్రోఫీ అందుకోవాలని ఢిల్లీ..

రెండో టైటిల్‌ వేటలో బెంగళూరు

వడోదర: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఆసక్తికర ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అద్భుతంగా ఆడుతూ టైటిల్‌ ఫైట్‌కు దూసుకొచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)..వరుసగా నాలుగోసారి అంతిమ సమరానికి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) ట్రోఫీకోసం గురువారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈసారీ టైటిల్‌ అందుకోవడం ద్వారా ఇప్పటి వరకు జరిగిన మూడు ఎడిషన్లలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ రికార్డును సమం చేయాలని ఆర్‌సీబీ ఆరాటపడుతోంది. మరోవైపు గతంలో మూడుసార్లు ఫైనల్‌ చేరినా..ఒక్కసారీ ట్రోఫీని ముద్దాడలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ దఫా ఆ పరిస్థితిని పునరావృతం చేయకూడదని పట్టుదలగా ఉంది. ఈసారి లీగ్‌లో ఆర్‌సీబీ ఆట అలా ఇలా లేదు. ఐదు వరుస విజయాలతో రికార్డు నెలకొల్పింది. హ్యారిస్‌, గౌతమీ నాయక్‌, జార్జియా వోల్‌, రిచాలతో బెంగళూరు బ్యాటింగ్‌ బలీయంగా ఉంది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ పేసర్లు డి క్లెర్క్‌, సయాలీ జట్టుకు అండగా నిలుస్తున్నారు. స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌ బెంగళూరు బౌలింగ్‌ తురుపు ముక్క. మొత్తంగా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్న ఆర్‌సీబీ అదే జోరులో టైటిల్‌ పట్టేయాలని అనుకుంటోంది. ఇక కొత్త కెప్టెన్‌ జెమీమా ఆధ్వర్యంలో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. ఢిల్లీ బలం ఆ జట్టు పేస్‌ బౌలింగే. పేసర్లు చినెల్లి హెన్రీ, నందిని ఫైనల్లోనూ సత్తా చాటితే ఢిల్లీకి తిరుగుండదు. గుజరాత్‌తో ఎలిమినేటర్లో రాణించిన లిజెల్లీ లీ నుంచి అదే ప్రదర్శనను జట్టట ఆశిస్తోంది. షఫాలీ, లారా వోల్వార్ట్‌, జెమీమా సహజ శైలిలో చెలరేగితే ఢిల్లీ కల నెరవేరడం కష్టం కాబోదు.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 03:05 AM