Share News

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:54 AM

పొట్టి క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్‌.. మరోసారి టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకొంటోంది. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది...

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

పొట్టి క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్‌.. మరోసారి టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకొంటోంది. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది. ఆ టోర్నీలో రోహిత్‌ బెరుకులేని ఆటతీరుతో ముందుండి నడిపించాడు. కప్‌ కొట్టే గెలుపు సూత్రాన్ని పరిచయం చేశాడు. ఆ ఫార్ములాపైనే ఇప్పటి జట్టు కూడా నిర్మితం కావడంతో.. భారత్‌ మరోసారి ఫేవరెట్‌గా మారింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా కూడా విశ్లేషించాడు. భారత జట్టు ఆడుతున్న విధానం చూస్తుంటే.. పొట్టి ఫార్మాట్‌లో మరోస్థాయికి చేరినట్టు కనిపిస్తోందని దాస్‌ చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీ్‌సను గమనిస్తే.. గత పొట్టిక్‌పలో రోహిత్‌ సేన అనుసరించిన పంథానే స్పష్టంగా కనిపించిందన్నాడు. ‘ఆ రోజు అత్యంత దురదృష్టం వెంటాడితే తప్ప.. భారత్‌ మరోసారి టైటిల్‌ సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేద’ని దాస్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, జడేజాలు రిటైరైనా.. వెస్టిండీ్‌సలో కప్పునెగ్గిన జట్టులోని ఎనిమిది మంది ఇప్పటి జట్టులో ఉండడం విశేషం. ‘హార్దిక్‌ కారణంగా జట్టులో స్థిరత్వం కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న అభిషేక్‌, వరుణ్‌ చక్రవర్తి జట్టులో ఉన్నారు. కోహ్లీ స్థానాన్ని తిలక్‌ వర్మ భర్తీ చేస్తున్నాడు. శివం దూబే.. ఇప్పుడు మరింత పరిణతి ప్రదర్శిస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండడం శుభపరిణామమ’ని దీప్‌దాస్‌ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 02:54 AM