Home » Cricket news
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ టెస్టులో జురెల్ సెంచరీ మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో శతకం చేశాడు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రిషభ్ పంత్ మరోసారి గాయపడ్డాడు. భారత్–సఫారీ ఏ మ్యాచ్‌లో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ త్వరగా కోలుకుని ఫీట్‌గా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో అగ్రెషన్‌తో ఉండే కోహ్లీ.. తండ్రి అయ్యాక నెమ్మదస్తుడు అయ్యాడని తెలిపాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీస్తే టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో ఈ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
హాంకాంగ్ ఇంటర్నేషన్ సిక్సెస్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. పూల్-సిలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్.. నిర్ణీత ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులకే పరిమితమైంది.
నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే టీ20 టోర్నీ భారత్ సొంతమవుతుంది. గాబా స్టేడియం పిచ్ పేసర్లకు అనుకూలం కావడంతో టీమిండియా పేసర్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.
ఐపీఎల్ 2026కి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2026 మార్చి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)కి లేఖ రాసింది.
1925లో అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టిన భారత హాకీ నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. స్వర్ణయుగం నుంచి టోక్యో, పారిస్ కాంస్యాలతో తిరిగి పాత వైభవం దిశగా సాగుతోంది.
బంగ్లా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాంపై పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేశారు. 2022 మహిళల వన్డే ప్రపంచ కప్ సందర్భంగా మంజురుల్ తనను లైంగికంగా వేధించాడని విమర్శించారు. మంజురుల్ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో తన కెరీర్‌కు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు.