Share News

టీమిండియా బ్యాట్లపై రబ్బరు పొర!

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:06 AM

భారత క్రికెటర్లు బ్యాట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారంటూ శ్రీలంక ఆటగాడు రాజపక్స సంచలన ఆరోపణలు చేశాడు. ‘మా బ్యాట్లకంటే భారత ఆటగాళ్లకు లభించే బ్యాట్లు...

టీమిండియా బ్యాట్లపై రబ్బరు పొర!

శ్రీలంక ప్లేయర్‌ రాజపక్స

కొలంబో: భారత క్రికెటర్లు బ్యాట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారంటూ శ్రీలంక ఆటగాడు రాజపక్స సంచలన ఆరోపణలు చేశాడు. ‘మా బ్యాట్లకంటే భారత ఆటగాళ్లకు లభించే బ్యాట్లు చాలా మెరుగ్గా, వాటి ఉపరితలంపై రబ్బరు పొరను పూసినట్టుగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. ఇలాంటి బ్యాట్‌లను ఇతరులు కొనలేరు’ అని ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజపక్స తెలిపాడు. అనంతరం తన కామెంట్స్‌పై రాజపక్స వివరణ ఇచ్చుకుంటూ.. ‘అనువాదలోపంతో నా మాటలను పొరపాటుగా అర్థం చేసుకున్నారు. భారత్‌లో బ్యాట్ల తయారీదారులు ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలను పాటిస్తారు. దీంట్లో వారి పట్ల గౌరవమే ఉంది తప్ప మరోటికాదు’ అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 13 , 2026 | 03:06 AM