Share News

ఫ్యామిలీకి నో ఎంట్రీ!

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:26 AM

"BCCI no family rule, Indian team policy, BCCI decision, World Cup family arrangements, player family restrictions, BCCI rules, World Cup news"

ఫ్యామిలీకి నో ఎంట్రీ!

ఆటగాళ్లకు దూరంగా ఉండాలన్న బీసీసీఐ

న్యూఢిల్లీ: మ్యాచ్‌లు జరిగే రోజుల్లో భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో ఉండే విషయంపై బీసీసీఐ తమ పాత నిర్ణయానికే కట్టుబడివుంది. అయినా ప్రస్తుత ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ విషయమై మరోసారి స్పష్టతనివ్వాల్సిందిగా బీసీసీఐని భారత జట్టు మేనేజిమెంట్‌ కోరిందట. అయితే దాన్ని బీసీసీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో కలిసివుండడానికి వీల్లేదని, కావాలంటే వారికి మరోచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని బోర్డు వర్గాలు తెలిపాయట. ఇదిలావుండగా, వాంఖడేలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌కి ఉపయోగిం చిన పిచ్‌పై భారత మేనేజిమెంట్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది.

Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 11 , 2026 | 05:26 AM