ఎలిస్, జంపా వికెట్ల వేట
ABN , Publish Date - Feb 12 , 2026 | 04:32 AM
పేసర్ నాథన్ ఎలిస్ (4/12), స్పిన్నర్ ఆడమ్ జంపా (4/23) వికెట్ల వేట కొనసాగించడంతో వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా అదిరే బోణీ చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో...
ఆస్ట్రేలియా అదిరే బోణీఫ ఐర్లాండ్ ఓటమి
కొలంబో: పేసర్ నాథన్ ఎలిస్ (4/12), స్పిన్నర్ ఆడమ్ జంపా (4/23) వికెట్ల వేట కొనసాగించడంతో వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా అదిరే బోణీ చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 67 పరుగులతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. స్టొయినిస్ (45), ఇన్‌గ్లి్‌స (37), రెన్షా (37) సత్తా చాటారు. మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఎలిస్, జంపా దెబ్బకు ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే చేతులెత్తేసింది. డాక్‌రెల్ (41), టకెర్ (24) మాత్రమే రాణించారు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు.
సంక్షిప్తస్కోర్లు
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 182/6 (స్టొయినిస్ 45, ఇన్‌గ్లి్‌స 37, రెన్షా 37, గ్రీన్ 21, మార్క్ అడైర్ 2/44).
ఐర్లాండ్: 16.5 ఓవర్లలో 115 ఆలౌట్ (డాక్‌రెల్ 41, టకెర్ 24, ఎలిస్ 4/12, జంపా 4/23).
టోర్నీకి మార్ష్ దూరం?
ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయంతో ప్రపంచ కప్‌నకు దాదాపు దూరమయ్యాడు. ఈవారం ఆరంభంలో ప్రాక్టీస్ సందర్భంగా మార్ష్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు బరిలో దిగలేదు. తాత్కాలిక సారథిగా హెడ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక..స్టీవ్ స్మిత్‌ను రప్పిస్తుండడంతో మార్ష్ టోర్నీకి దూరమైనట్టేనని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!
టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం