మెగా టోర్నీకి 53% పెరిగిన వీక్షకులు
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:22 AM
తమ డిజిటల్ సాధనాల్లో టీ20 వరల్డ్‌కప్ వ్యూయర్‌షిప్ గత టోర్నీతో పోల్చుకొంటే.. 53 శాతం మేర పెరిగినట్టు ఐసీసీ తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో 64.7 కోట్ల వీడియో వ్యూస్ నమోదైనట్టు...
న్యూఢిల్లీ: తమ డిజిటల్ సాధనాల్లో టీ20 వరల్డ్‌కప్ వ్యూయర్‌షిప్ గత టోర్నీతో పోల్చుకొంటే.. 53 శాతం మేర పెరిగినట్టు ఐసీసీ తెలిపింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో 64.7 కోట్ల వీడియో వ్యూస్ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా అసోసియేట్ జట్లు పాల్గొంటున్న దేశాలు నేపాల్, యూఏఈ, అమెరికా నుంచి భారీగా వ్యూస్ వస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ‘2024తో పోల్చుకొంటే ఐసీసీ యాప్‌లో యూజర్ల సంఖ్య 83 శాతం పెరిగింది. అదే సమయంలో 16 శాతం మంది ఐసీసీ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. నేపాల్ లాంటి దేశం నుంచి వ్యూయర్‌షిప్ 442 శాతం మేర హెచ్చింది. యూఏఈ, అమెరికాల నుంచి వీక్షకుల సంఖ్య 196 శాతం, 49 శాతం పెరిగాయి. క్రికెట్ పాపులారీటి ప్రపంచమంతా విస్తరిస్తున్నదనడానికి ఇదే ఉదాహరణ’ అని ఐసీసీ తెలిపింది. ఇంగ్లి్‌షలోనే కాకుండా నేపాలీ తదితర భాషల్లో వ్యాఖ్యానాలను ఏర్పాటుచేయడం వీక్షకుల సంఖ్య భారీగా పెరగడానికి ఒక కారణమని తెలుస్తోంది.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!