Share News

పాక్‌కు అఫ్ఘాన్‌ క్రికెటర్ల ఝలక్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:00 AM

పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్థాన్‌ క్రికెటర్లు ఝలక్‌ ఇచ్చా రు. బుధవారం జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ వేలం నుంచి అఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు చివరి నిమిషంలో వైదొలిగారు...

పాక్‌కు అఫ్ఘాన్‌ క్రికెటర్ల ఝలక్‌

పీఎస్ఎల్‌ వేలానికి దూరం

కరాచీ: పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్థాన్‌ క్రికెటర్లు ఝలక్‌ ఇచ్చా రు. బుధవారం జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ వేలం నుంచి అఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు చివరి నిమిషంలో వైదొలిగారు. వేలానికి అఫ్ఘాన్‌ క్రికెటర్లు ముజీబుర్‌ రెహ్మాన్‌, సెదికుల్లా, మహ్మద్‌ నబీ, వకార్‌ సలామ్‌ఖీల్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే గతంలో పాక్‌కు వ్యతిరేకంగా పో స్టులు పెట్టిన అఫ్ఘాన్‌ ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ను పె షావర్‌ జల్మీ జట్టు తీసుకోవడంపై వ్యతిరేకత వచ్చింది. దరి మిలా పీఎస్‌ఎల్‌నుంచి వైదొలగాలని గుర్బాజ్‌ నిర్ణయించుకున్నా డు. దాంతో గుర్బాజ్‌ను అనుసరిస్తూ మిగతావారు తప్పుకొన్నారు.

ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 13 , 2026 | 03:00 AM