Home » Court
తిరుపతి రూరల్‌లోని దామినీడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్ల భూమిని కోర్టు భవనాల నిర్మాణ కోసం కేటాయించింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శనివారం) హాజరయ్యారు. గతంలో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట ఆయన కోర్టులో హాజరై విచారణను ఎదుర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ హైకోర్టు, నాంపల్లి, విశాఖ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు..
సాక్షి మీడియాపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వైసింది. సాక్షి మీడియాపై రూ.వంద కోట్లకు హెరిటేజ్ సంస్థ దావా వేసింది..
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్ గడువుని విజయవాడ ఎక్సైజ్ కోర్టు పొడిగించింది. నిందితుల రిమాండ్ గడువుని మార్చి 5వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, లైంగికంగా దాడి చేసిన ఘటనలో ఎస్ఐ రవితేజకు గుంటూరు జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది.
సత్యం కంప్యూటర్ స్కామ్‌లో జన్వాడ భూములపై నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.