తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:25 PM
తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ హైకోర్టు, నాంపల్లి, విశాఖ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనం ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ప్రతి వాహనాన్ని చెక్ చేశారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు, నాంపల్లి కోర్టుకూ బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని వెంటనే బయటకు పంపించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు.
ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట, అసెంబ్లీ సహా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాడు.. వెంటనే తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎలాంటి బాంబులు లేవని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and National News