Share News

అమానుషం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై..

ABN , Publish Date - Feb 25 , 2026 | 09:28 AM

అస్సాం రాష్ట్రంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్తున్న మహిళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

అమానుషం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై..
Assam Harassment Case

ఇంటర్నెట్ డెస్క్: అస్సాం(Assam) రాష్ట్రంలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై ఏడుగురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా, ఆమె వద్ద ఉన్న నగదు దోచుకెళ్లిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న గువాహటి‌లోని సిల్చార్ పట్టణానికి చెందిన బాధితురాలు తన ప్రియుడితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్డు వద్ద మహీంద్రా థార్‌లో కొంతమంది వ్యక్తులు వీరిని వెంబడించారు.


కొంత దూరం వెంబడించిన తర్వాత దుండగులు కారును అడ్డుకుని, ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా రూ.10 వేలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సిల్చార్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు వారిలో ఇద్దరిని గుర్తించిందని, ఆదివారం వారిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సిల్చార్ పట్టణానికి చెందిన నీలోత్పాల్ దాస్ (25), సుబోల్ దాస్ (27)గా గుర్తించారు. మిగిలిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవుడు క్షమించడు!

రైలు ప్రయాణికులకు రివార్డులు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2026 | 10:44 AM