స్నేహితుడి మృతిని తట్టుకోలేక..
ABN , Publish Date - Feb 25 , 2026 | 06:55 AM
స్నేహితుడి మృతిని తట్టుకోలేక మదన పడుతూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దోమల్‌గూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: స్నేహితుడి మృతిని తట్టుకోలేక మదన పడుతూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దోమల్‌గూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కవాడిగూడ పరిధిలోని న్యూ అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్(23) మద్యానికి బానిసై ఖాళీగా తిరిగేవాడు. ఇతనికి సమీపంలోని ఎల్చిగూడకు చెందిన ప్రదీప్‌తో పాటు మరో నలుగురు స్నేహితులున్నారు.
అయితే, ఈ నెల 20న ప్రదీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను అకారణంగా చనిపోయాడని శ్రవణ్ తన తోటి స్నేహితులతో రోజూ మదన పడేవాడు. సోమవారం అర్ధరాత్రి తర్వాత శ్రావణ్ తన నివాసంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అతను ఉరేసుకున్న విషయాన్ని తల్లి మణి గమనించింది. కుటుంబ సభ్యుల సహకారంతో అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రవణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే, తన కుమారుడు శ్రవణ్ స్నేహితుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న నాటినుంచి తోటి స్నేహితులతో మదనపడుతూ ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో కూడా సక్రమంగా ఉండటం లేదని మణి పోలీసులకు వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు దోమలగూడ ఎస్‌ఐ విజయ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News