సచిన్‌ను అవుటిచ్చి..తప్పు చేశా!
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:58 AM
అంపైర్ స్టీవ్ బక్నర్.. పాతతరం క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. 2003లో ఆస్ర్టేలియాతో జరిగిన టెస్టులో సచిన్‌ను ఎల్బీగా అవుట్ చేసిన నిర్ణయం బక్నర్‌ను తీవ్ర విమర్శల...
మాజీ అంపైర్ స్టీవ్ బక్నర్
కింగ్‌స్టన్: అంపైర్ స్టీవ్ బక్నర్.. పాతతరం క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. 2003లో ఆస్ర్టేలియాతో జరిగిన టెస్టులో సచిన్‌ను ఎల్బీగా అవుట్ చేసిన నిర్ణయం బక్నర్‌ను తీవ్ర విమర్శల పాలు చేసింది. అయితే 22 ఏళ్ల తర్వాత అప్పటి నిర్ణయంపై తను పశ్చాత్తాపం వ్యక్తం చేశా డు. ‘సచిన్ ఎల్బీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు. జీవితంలో తప్పులు చేస్తుంటాం. సరిదిద్దుకుని ముందుకుసాగాల్సిదే’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఆ టెస్టులో గిలెస్పీ వేసిన బంతి సచిన్ ప్యాడ్లను తాకింది. వెంటనే బక్నర్ ఎల్బీగా ప్రకటించాడు. నిజానికి ఆ బంతి స్టంప్స్‌పైన వెళ్తున్నట్టుగా రీప్లేలో స్పష్టంగా తేలింది. అప్పట్లో బక్నర్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ