మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
ABN , Publish Date - Feb 24 , 2026 | 09:36 PM
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి సర్వే వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి సర్వే వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది (Malla Reddy news).
భూమి వ్యవహారంలో సర్వే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది (Supreme Court setback). జీడిమెట్ల సర్వే నెంబర్ 82లో ఉన్న 2.22 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. వివాదాస్పద భూమికి సంబంధించి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ నోటీసులు లేకుండా సర్వే చేశారని మల్లారెడ్డి గతంలో హై కోర్టును ఆశ్రయించారు. ఆ సర్వేపై హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్థించింది.
ఇవి కూడా చదవండి..
మా బలం 2002... నోరు జారిన నితీశ్
వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు