Home » Congress
దేశంలో పూర్తి చట్టపరమైన మినహాయింపు పొందుతున్న ఏకైక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయినా దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం దళితులు, ఆదివాసీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'జెన్ జీ' యువతకు పిలుపునిచ్చారు. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు.
కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సర్ అనేది కొత్తది కాదని తెలిపారు. ఈవీఎంలను తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును తెలంగాణ కాంగ్రెస్ పూర్తి చేసింది. రెండు స్థానాలకు జాబితాను సిద్ధం చేసిన టీపీసీసీ.. దాన్ని అధిష్ఠానానికి పంపించింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పిస్తే.. మోదీ 'ఓటు రద్దు' కుట్రలతో లాక్కుంటున్నారని ఆగ్రహించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను ఢిల్లీ మంత్రి పర్వేశ్ శర్మ చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల మధ్య ప్రశ్నిస్తే, చెంపదెబ్బ కొడుతున్నారని, పేపర్ లీకుల గురించి మాట్లాడితే లాఠీచార్జి చేయిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాలపై ఎక్స్‌లో ఆయన మండిపడ్డారు.
ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారంటూ జరిగిన రాద్ధాంతం మీద ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఆ లేఖ ఈసీఐ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించింది కాదని, అది కేవలం డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ అధికారి పనితీరుకు సంబంధించినదని వివరణ ఇచ్చింది.